English   

రాజమౌళికి భయపడుతున్న మహేష్.. పవన్

mb
2020-02-07 05:09:07

దర్శక ధీరుడు రాజమౌళి నిర్ణయం ఇప్పుడు స్టార్ హీరోలైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్‌ బాబులను భయపెడుతోందని ప్రచారం జరుగుతోంది. ఇంత పెద్ద స్టార్ హీరోలను జక్కన్న కలవరపెట్టడం ఏంటి అనుకుంటున్నారా..? అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్.. లతో భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ విషయంలోనే మహేష్, పవన్ లు డైలామాలో ఉన్నారట.

ముందుగా 'ఆర్ఆర్ఆర్' మూవీని ఈ ఏడాదిలోనే జూలైలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కానుండడంతో.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2021లో జనవరి 8న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు జక్కన్న. దాంతో ఇప్పటికే సంక్రాంతికి బెర్త్ కన్ఫామ్ చేసుకున్న పవన్, మహేష్ సినిమాలు వాయిదా పడటం ఖాయమంటున్నారు. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి దర్శతకత్వంలో మరోసారి నటిస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ డేట్ ఫిక్స్ చేయడంతో.. మహేష్ సినిమా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు.

అలాగే పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో పవన్ మూవీ కూడా సంక్రాంతి రేసులో నుంచి తప్పుకున్నట్టే అంటున్నారు. అందుకే కొంచెం ముందుగానే.. అంటే క్రిస్ట్మస్ కానుకగా లేదా ఇంకాస్త ముందుగా దీపావళికే పవన్ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వినిపిస్తోంది. మహేష్ మూవీ కూడా ఈ ఫెస్టివల్ సీజన్లోనే రానున్నట్టు సమాచారం. ఎందుకంటే.. వండర్స్ క్రియేట్ చేసే జక్కన్నతో తెలిసి తెలిసి పెట్టుకోవడం ఎందుకని భావిస్తున్నారట ఈ చిత్ర దర్శక నిర్మాతలు. ఇకపోతే ఈ స్టార్ హీరోల పరిస్థితే ఇలా ఉంటే.. వేరే సినిమాలేవి రాజమౌళి సినిమాతో పోటీ పడే సాహసం చేయదంటున్నారు. ఏదేమైనా దర్శకధీరుడు ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించి మంచి పని చేశాడంటున్నారు.

 

More Related Stories