English   

జాను సినిమా ట్విట్టర్ రివ్యూ... శర్వా సమంత మాయ చేసారా...

Jaanu Twitter Review.jpg
2020-02-07 07:20:23

96 సినిమా రీమేక్ అన్నపుడు తెలుగులో చాలా వరకు అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు. ఈ రీమేక్ వర్షన్ జాను విడుదలైంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఒరిజినల్ చూసిన ఫీల్ అయితే రాలేదంటున్నారు కానీ చెడగొట్టలేదు అనే టాక్ అయితే వచ్చింది. అయినా కొన్ని సినిమాలు చూడటానికి మాత్రమే.. వాటిని టచ్ చేయకూడదు. ఇవన్నీ తెలిసి కూడా కొన్నిసార్లు కొందరు నిర్మాతలు ధైర్యంగా ముందడుగు వేస్తుంటారు. ఇప్పుడు దిల్ రాజు చేసింది కూడా ఇదే.

తమిళనాట విజయం సాధించిన 96 సినిమాలు తెలుగులో జాను పేరుతో రీమేక్ చేశాడు ఈ నిర్మాత. అక్కడ  విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ తెర‌కెక్కించాడు. విడుద‌లైన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఈ చిత్రం గురించి టాపిక్స్ న‌డుస్తూనే ఉన్నాయి. తెలుగులో కూడా ఈయనే తెరకెక్కించాడు. ఇప్పుడు విడుదలైన సినిమాకు అదే ఎమోషన్స్ వర్కవుట్ అయినట్లే కనిపిస్తున్నాయి కానీ ఫస్టాప్ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుందని తెలుస్తుంది. కొంత వరకు ఎమోషన్స్ బాగానే క్యారీ కావడం.. శర్వానంద్, సమంత పోటీ పడి నటించడంతో తమిళ్ సినిమాను కాస్తైనా మరిపించే ప్రయత్నం చేసారు ఈ జంట. పైగా దర్శకుడు ప్రేమ్ కూడా తమిళ సినిమాను ఏ మాత్రం మార్చకుండా ఉన్నదున్నట్లు తెలుగులో రీమేక్ చేసాడు.

శర్వానంద్, సమంత కూడా పూర్తిగా విజయ్, త్రిష పాత్రలను ఓన్ చేసుకున్నారు. సొంత స్టైల్ కూడా కనిపిస్తున్నా.. ఒరిజినల్ చూసిన వాళ్లకు జాను కొత్తగా అనిపించదు. పైగా పొయెటిక్ టచ్ కూడా మరీ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ చిత్రం తెలుగులో ఎంతవరకు ఆట్టుకుంటుందనేది పక్కనబెడితే కచ్చితంగా హృదయాన్ని తాకే మంచి సినిమా అవుతుందనేది మాత్రం అర్థమైపోతుంది. విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

More Related Stories