English   

దర్బార్ దెబ్బకి పోలీస్ భద్రత కావాలంటున్న మురుగదాస్

Murugadoss
2020-02-07 09:50:40

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో దర్శకుడు మురగదాస్ తెరకెక్కించిన సినిమా ‘దర్బార్‌’. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా మొన్న సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్ల విషయానికొచ్చి బోల్తా కొట్టేసింది. ఎన్నో అంచనాలతో ముందుకొచ్చిన ఈ సినిమాని తమిళ డిస్త్రిబ్యూటర్ లు భారీ రేటుకు కొనుగోలు చేశారు. అయితే కలెక్షన్లు అనుకున్నంత వారు దాదాపుగా కోట్ల రూపాయల మేరకు నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. 

అయితే తమ నష్టాలను దర్శకుడు మురగదాస్‌, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ లు భరించాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో రజనీకాంత్ చేతులు ఎత్తేయడంతో ఇప్పుడు ముగదాస్‌ను కలిసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే నిర్మాతలు కూడా చేతులు ఎత్తేయడంతో తనవల్ల కాదని మురగదాస్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా దిస్త్రిబ్యుటర్ ల నుంచి ప్రాణహాని ఉందని, నాకు పోలీసు భద్రత ఏర్పాటు చేయాలంటూ మురగదాస్‌ హైకోర్టుకు కోరారు. తన ఆఫీస్ పై కూడా దాడి చేశారని.. తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని ఆయన కోర్టును కోరారు. మరి దీనికి హైకోర్టు ఏమని చేబుతుందో చూడాలి.

More Related Stories