English   

క్రేజీ బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసిన మమతా

Mamta Mohandas
2020-02-07 10:54:25

ప్రస్తుతం అన్ని బాషలలో బయోపిక్స్ కి మంచి క్రేజ్ ఉంది. క్రీడాకారులు, సినిమా యాక్టర్స్ అలానే రకరకాల రంగాల్లో నిరూపించుకున్న వారి జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇక  ప్రముఖ ఇండియన్‌ సివిల్‌ ఇంజనీర్, మెట్రో మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన ఇ.శ్రీధరన్‌ జీవితాధారంగా మలయాళంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. 

మళయాళ దర్శకుడు ప్రకాష్‌ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో నటి మమతా మోహన్‌ దాస్‌ శ్రీధరన్‌ భార్య రాధ పాత్రలో నటించనుందని సమాచారం. ‘రామసేతు: ఎ బ్రిడ్జ్‌ బిట్వీన్‌ గాడ్‌ అండ్‌ సొసైటీ’ పేరుతో  తెరకెక్కుతున్న ఈ సినిమాకి మళయాళ రచయిత సురేష్‌ బాబు కథ అందిస్తున్నారు. ఇందులో శ్రీధరన్‌గా జయసూర్య నటిస్తున్నారు. కేరళలో జన్మించిన శ్రీధర్‌ తన మాస్టర్స్ ఇంజనీరింగ్‌ ని కాకినాడలోని యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో పూర్తిచేశారు. ఇక ఎంతో ప్రాముఖ్యత పొందిన ఢిల్లీ మెట్రో, కొంకణ్‌ రైల్వే, కొచ్చి మెట్రో లాంటి ప్రాజెక్టులు శ్రీధర్‌ చేతిలో రూపుదిద్దుకున్నవే. అందుకే ఆయనకు మెట్రో మ్యాన్ అనే పేరు సార్ధకం అయిపొయింది. 

పద్మ విభూషణ్, పద్మశ్రీ వంటి ఎన్నో అవార్డులు సాధించిన ఆయన మీద బోయోపిక్ గత ఏడాదే ప్రకటించారు. అయితే వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ లేటయ్యింది. క్యాన్సర్ ఎటాక్ కావడంతో సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న మమతా మోహన్‌ దాస్‌ ఇప్పటికే ‘ఫోరెన్సిక్‌’ అనే చిత్రంలో ఐపీఎస్‌ అధికారిగా నటిస్తుంది. అంతేకాదు ‘లాల్‌బాగ్‌’ అనే మరో మలయాళి చిత్రంలోను నటిస్తోంది. అయితే మమత నాగార్జునతో చేసిన ‘కేడీ’ తరువాత మళ్లీ ఇప్పటి వరకు తెలుగులో నటించలేదు.

More Related Stories