English   

పూరీ - విజయ్ సినిమాకి వెరైటీ టైటిల్

puri
2020-02-07 20:00:23

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇప్పుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ ఫైటర్ గా నటించనున్నాడు. ఇస్మార్ట్ హిట్ కొట్టి ఉన్న పూరీ జగన్నాద్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో పని చేస్తుండడం తో ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. పూరీ జగన్నాధ్ సొంత నిర్మాణ సంస్థతో పాటుగా కరణ్ జోహార్ కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మార్షల్ ఫైట్స్ ఫైటర్ గా నటించనున్న విజయ్ దాని కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. అయితే ఈ సినిమాకి టైటిల్ గా ఫైటర్ అనే పేరు ఫిక్స్ చేసినట్టు గా ప్రచారం జరిగింది. కానీ తాజాగా మరో ప్రచారం మొదలయింది. ఈ సినిమాకి లైగర్ అనే పేరు అనుకుంటున్నటుగా చెబుతున్నారు. మగ సింహం.. ఆడ పులి సంతానమే లైగర్‌! విచిత్రంగా ఇవి సింహం.. పులి కన్నా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి కాస్త సింహంలానే గర్జిస్తాయి. అయితే పూరీ ఈ టైటిల్ అనుకుంటున్నాడంటే పెద్ద ప్లానే వేసిఉంటాడని అనుకుంటున్నారు . లైగర్ టైటిల్ సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో ఏది నిజమో తేలాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

More Related Stories