English   

వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ న్యూ లుక్..

pk
2020-02-07 20:49:21

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ లుక్ మార్చేసాడు. ఈయ‌న లుక్ మార్చేస్తే చాలు అభిమానులు కూడా గాల్లో తేలిపోతుంటారు. తాజాగా ఈయ‌న గడ్డం మీసాలు తీసేసి కొత్త లోకి మారిపోయాడు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన కూడా మళ్లీ అదే గడ్డంతో కనిపించేసరికి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటి ఇంకా పాత లుక్ లోనే సినిమా చేస్తున్నాడు అంటూ అవాక్కయ్యారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి పూర్తిగా న్యూ లుక్ లోకి వచ్చేసాడు పవర్ స్టార్. ఆయ‌న్ని చూసి ఫ్యాన్స్ అంతా ఒక్క‌సారిగా ఫిదా అయిపోయారు. త‌మ అభిమాన హీరో మ‌ళ్లీ పాత లుక్ లోకి వచ్చేసరికి పండగ చేసుకుంటున్నారు. కాటమరాయుడు సినిమా స‌మ‌యంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు ప‌వ‌న్ అలా ఉన్నాడు. ఒక‌ప్పుడు సినిమా హీరోలా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మ‌ధ్య పూర్తిగా రాజ‌కీయ నాయ‌కుడు అయిపోయాడు. మ‌ళ్లీ ఇప్పుడు సినిమా హీరో అయిపోయాడు. త‌ను సినిమాలు చేయ‌న‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా కూడా పట్టుబట్టి మరి ఆయనతో సినిమాలు చేయిస్తున్నారు నిర్మాతలు.
అజ్ఞాత‌వాసి త‌ర్వాత భారీ విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వేణు శ్రీరామ్ తో చేస్తున్న పింక్ సినిమా రీమేక్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ సినిమా కూడా  వేగంగా జరుగుతుంది. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే 2021లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తోనే సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి రాజకీయాల్లో చేయడం ఏమీ లేకపోవడంతో వరుస సినిమాలు చేస్తూ అభిమానులను ఖుషీ చేయిస్తున్నాడు పవర్ స్టార్.

More Related Stories