English   

ముద్దు పెట్టడం కష్టంగా ఉంది అంటున్న హీరోయిన్..

act
2020-02-07 21:08:53

ఈ రోజుల్లో ముద్దు సన్నివేశాలు లేని సినిమాలను ఊహించుకోవడం కష్టమే. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ముద్దులో పలికించవచ్చు అంటున్నారు దర్శకులు. బాలీవుడ్ సినిమాల్లో అయితే కిస్సింగ్ సీన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి సినిమాలోనూ లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి ముద్దు సన్నివేశాల వెనక హీరోయిన్ల కష్టాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. దర్శకుడు చెబుతున్నారని.. కథ డిమాండ్ చేసిందని లిప్ లాక్ సన్నివేశాలు చేస్తున్నారు హీరోయిన్లు. కానీ అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు తమకు చాలా ఇబ్బందిగా ఉంటుందని.. అది ఎవరూ పట్టించుకోరు అంటుంది బాలీవుడ్ హీరోయిన్ రిచా చడ్డ. హిందీలో ఇప్పటివరకు అరడజను సినిమాలకు పైగా నటించినా.. ఈ ముద్దుగుమ్మకు కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. అయితే ప్రతి సినిమాలో హాట్ సన్నివేశాలు మాత్రం బాగానే చేసింది రిచా. అన్నింటికీ తోడు ముద్దు సన్నివేశాల్లో ఈమె ఎక్స్ పర్ట్. ప్రతి సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ చాలా వరకు నటించింది ఈ ముద్దుగుమ్మ. మీరందరూ మేం చేసే లిప్ లాక్ సీన్స్ చూసి హాయిగా ఎంజాయ్ చేస్తారు..

కానీ లోకేషన్ లో మేము ఎంత ఇబ్బంది పడతాము అనేది మీరు కనీసం కలలో కూడా ఊహించరు.. అక్కడ వందల మంది చూస్తుండగా కెమెరా ముందు ముద్దులు పెట్టుకోవాలి.. అది చిన్న విషయం కాదు.. మొన్న ఒక సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు లిప్ లాక్ సన్నివేశం చేయాల్సిన సందర్భంలో మధ్యలో ఒక కెమెరామెన్ వచ్చి డిస్ట్రబ్ చేసాడు.. దాంతో మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వచ్చింది అంటుంది రిచా. అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.. అలాంటివి చాలా ఉంటాయి.. అవన్ని అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి రిచా చడ్డా.

More Related Stories