English   

అప్పుల్లో పవన్ కళ్యాణ్.. అందుకే వరుస సినిమాలు..

pk
2020-02-08 06:47:58

వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇదే టాపిక్ ఎక్కువగా వినిపిస్తోంది. నిజంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అప్పులో ఉన్నాడని.. అవి తీర్చడానికి సినిమాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అంతగా ఆయన అప్పుల్లో కూరుకుపోవాల్సిన అవసరం అవసరం ఏమొచ్చింది అనే అనుమానం రావచ్చు. కానీ ఈ అప్పులు తనకోసం చేసినవి కావు.. ఎలక్షన్ సమయంలో జనసేన పార్టీ కోసం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే గతేడాది ఎన్నికల సమయంలో జనసేన సోషల్ మీడియా ప్రచారం కోసం ఒక అమెరికన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుందని.. ఆ సమయంలో వాళ్ళు పార్టీకి ప్రచారం చేసినందుకు గాను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఒకవేళ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ని గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.. ఆయనతో పాటు పార్టీ కూడా దారుణంగా పడిపోవడంతో ఇప్పుడు చేసిన అప్పులు తీర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ తలపై పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని అప్పులు ఒకేసారి తీర్చాలంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. దానికితోడు పార్టీ నడవడానికి కూడా ఆయన బయట నుంచి వచ్చే డబ్బులు వాడుకోను అంటూ తెగేసి చెప్పాడు. అలాగని తనకు కోట్లకు కోట్లు వచ్చే వ్యాపారాలు లేవని.. సినిమాలు చేస్తే తప్ప తనకు డబ్బులు వచ్చే మార్గం లేదని చెప్పాడు పవర్ స్టార్.

అందుకే వీలైనంత త్వరగా ఎన్ని సినిమాలు కుదిరితే అన్ని పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాడు పవన్. రాబోయే రెండేళ్లు పూర్తిగా కాన్సంట్రేట్ చేసి దాదాపు నాలుగు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నాలుగు సినిమాలకు గాను దాదాపు 200 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. అందులో చాలావరకు బ్యాంకు అప్పుల రూపంలో వెళ్లిపోతాయని.. మిగిలిన డబ్బులు పార్టీ ఖర్చు కోసం వాడుకుంటాడు అని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ అప్పుల్లో ఉన్నాడు అనే విషయం తెలుసుకున్న అభిమానులు కూడా అయ్యో అనుకుంటున్నారు. ఆయన ఉ అంటే పార్టీకి కోట్ల ఫండ్ ఇచ్చే నేతలు చాలామంది ఉన్నారు. కానీ పవన్ మాత్రం తన సొంత డబ్బుతోనే పార్టీని నడపాలని నిశ్చయించుకున్నాడు.

More Related Stories