English   

ఆర్ఆర్ఆర్ నిజాం రైట్స్ కోసం భారీ రేట్ ఆఫర్ చేసిన దిల్ రాజు

dilrajurrr
2020-02-08 07:11:19

బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2021న విడుదల చేస్తామని ఇప్పటికే సినిమా నిర్మాతల నుండి ప్రకటన వచ్చింది. అయితే ఒకటి మాత్రం క్లారిటీ వచ్చేసింది సినిమా మాత్రం ఇంకా షూట్ కూడా పూర్తి కాలేదని. అయితే సినిమా ఎలా ఉంటుందో కూడా చూడకుండా ఆర్ఆర్ఆర్ రైట్స్ పొందడానికి పోటీపడుతున్నారు. దిల్ రాజు తాజాగా ఆర్ఆర్ఆర్ నిజాం హక్కుల కోసం రాజమౌళి టీం కోసం భారీగా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 75కోట్లను నైజాం రైట్స్ హక్కుల కోసం ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే  ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నైజాంలో ఇప్పటివరకూ ఏ సినిమా కూడా 70కోట్ల వసూళ్లు సాధించలేదు. అయినా ఆర్ఆర్ఆర్ పై ఉన్న నమ్మకంతోనే దిల్ రాజు భారీగానే ఆఫర్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా ఆంధ్ర రైట్స్ 100 కోట్లకు ప్రవీణ్ సొంతం చేసుకున్నాడు. ఈ రేటు ప్రకారం సీడెడ్ హక్కులు రూ.50 కోట్లు ఈజీగా సాధిస్తుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండింట్లో ఏకంగా 225 కోట్లకు ఆర్ఆర్ఆర్ మూవీ అమ్ముడు పోవడం ఖాయమని తెలుస్తోంది.

 

More Related Stories