English   

అభిమానులకి షాకిచ్చిన సమంతా..

Samantha
2020-02-08 10:49:08

అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడిన తర్వాత సమంత వరుస సినిమాలకు సంతకాలు చేస్తూ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. అయితే ఈ మధ్య కాలంలో సమంతలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఇటీవల శామ్ సడెన్ గా సినిమాలు తగ్గించింది. ఆమె చాలా సెలెక్టివ్‌ గా సినిమాలు చేస్తూ వస్తోంది.తాజాగా సమంత నటించిన జాను సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పుడు వెబ్ సిరీస్ మీద ద్రుష్టి పెట్టిన సామ్ త్వరలో సినిమాలు ఆపేసే పరిస్థితి కనిపిస్తోంది. 

మరో రెండు మూడేళ్ల వరకు మాత్రమే ఆమె సినిమాల్లో నటించే అవకాశం ఉందని ఆమె ప్రకటించి బాంబ్ పేల్చింది.  ఇకపై ఫ్యామిలీ లైఫ్ కే ప్రాధాన్యత. పిల్లల్ని కనడం వారి ఆలన పాలనా చూసుకోవాల్సిన సమయం వచ్చేసిందనిమ్ హీరోయిన్ కెరీర్ స్పాన్ చాలా చిన్నదన్న ఆమె ఇంకా నటిస్తూనే ఉన్నానని  అది అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.  ఆలేక్కన ఆమె తన సినీ కెరీర్ కి బ్రేకులు వేసి పిల్లలను కనే పనిలో ఉందన్నమాట.

More Related Stories