English   

చర్చనీయాంశంగా మారిన పవన్ చేతి టాటూ 

 Pawan Kalyan
2020-02-08 11:24:06

పవ‌ర్ స్టార్ ప‌‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆయ‌న రీఎంట్రీ మూవీ మొద‌లైన రోజు నుంచి ఆయ‌న మీద ఒక రకమైన ఫోక‌స్ కూడా మొదలైంది. తాజాగా గురువారం క్రిష్ సినిమా షూటింగ్‌లో పాల్గొని ఆ త‌ర్వాత సాయంత్రానికి ఓ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. చానళ్ళ త‌ర్వాత గ‌డ్డం లాంటివి ఏమీ లేకుండా క్లీన్ షేవ్‌లోకి ప‌వ‌న్ మారేస‌రికి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

పీకే న్యూ లుక్ అద‌ర‌హో అంటూ సోష‌ల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.  ఒకేసారి రెండు సినిమాలను పట్టాలెక్కించిన పవర్‌ స్టార్‌ యుద్ద ప్రాతిపదికన షూటింగ్‌లు పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే పింక్‌ రీమేక్‌ షూటింగ్ పూర్తి చేసిన పవన్ ఇప్పుడు క్రిష్ సినిమా చేస్తున్నారు. అయితే ఆయన మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు పవన్‌ చేతిమీద ప్రత్యక్షమైన ఓ టాటూ ఇప్పుడు అనేక చర్చలకు తావిస్తోంది. 

పవన్‌ కుడి చేతి మీద త్రిశూళం, డమరుకంలా ఉన్న టాటూ ఒక్కటి కనిపిస్తోంది. ఈ టాటూ పవన్ సినిమా కోసం వేయించుకున్నాడా..? లేక తన వ్యక్తిగతంగా వేయించుకున్నాడా..? అన్న చర్చ జరుగుతోంది. క్రిష్ సినిమాలో పవన్‌ బందిపోటు దొంగగా కనిపించనున్నాడని ప్రచారం జరిగింది. పవన్ క్లీన్‌ షేవ్‌ లుక్‌ కూడా ఈ సినిమా కోసం అన్న టాక్ వినిపిస్తోంది. ఒక‌ప్ప‌టి బందిపోటు దొంగ తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ‌ల సాయ‌న్నగా క‌నిపించ‌బోతున్నార‌ని ప్రచారం జరుగుతోంది. ఈ టాటూ కూడా సినిమా కోసమే అని అంటున్నారు. ఇందులో నిజం ఎంతుందో సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు.

More Related Stories