English   

విజయ్ ఫ్యాన్స్ కి అండగా అజిత్ ఫ్యాన్స్

 Ajith Vijay Fans
2020-02-08 11:44:52

సినీ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం అనేది కామన్. అందునా తమిళ ఫ్యాన్స్ అంటే గుర్తుకు వచ్చేది విజయ్ అజిత్ ఫ్యాన్స్ మధ్య జరిగే ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ వార్ మాత్రమే. వీరిరువురి ఫ్యాన్స్ చీటికిమాటికి సోషల్ మీడియాలో గొడవ పడడం తరచూ చూస్తున్నాం. వీరి ద్వేషం పాళ్ళు ఇంతదాకా వెళ్ళింది అంటే చివరికి అజిత్ మరియు విజయ్ మరణించినట్లు కూడా హ్యాష్ త్యాగ లు పెట్టి మరీ రచ్చ చేస్తుంటారు. 

అయితే తాజాగా హీరో విజయ్ పై ఐటి అధికారులు షూటింగ్ సెట్ లోనే దాడులు జరిపి అతనిని రెండు గంటల పాటు విచారించారు . ఆ తర్వాత విజయ్ నివాసం నుంచి దాదాపు 65 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే విజయ్ పై రాజకీయ కక్షతో ఐటీ దాడులు జరుపుతున్నారని ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఒక గనిలో షూట్ కి వెళ్ళగా అక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు షూట్ అడ్డుకున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా వెళ్లి అడ్డుపడ్డంతో అక్కడ ఉద్రిక్తత నెలకొని లాఠీఛార్జి కూడా జరిగింగి. అయితే ఇప్పుడు అజిత్ ఐటి దాడుల గురించి చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. 

"పన్ను రేట్లు , టాక్సుల శాతం పెంచడం, ఆపై సెలెబ్రిటీలపై రైడ్స్ పేరుతో విరుచుకుపడడం లాంటి చర్యలు ఆపండి. ప్రజల సొమ్ముని సినిమా సెలెబ్రిటీలు దోచుకోవడం లేదు . డబ్బంతా అవినీతిపరులైన రాజకీయ నాయకుల వద్దే ఉంది . ఒక సారి అవినీతిపరులైన రాజకీయ నాయకులందరిపై రైడ్స్ చేయండి . ఈ దేశంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి" అని అజిత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ మాటలను గుర్తు చేసుకుని అజిత్ ఫ్యాన్స్ లో ఒక వర్గం విజయ్ ఫ్యాన్స్ కి విజయ్ కి బాసటగా నిలుస్తున్నారు.  

More Related Stories