English   

జబర్దస్త్ బ్యాచ్ కు మరో ఝలక్.. జాడలేని మూడు కోతులు..

3 Monkeys
2020-02-08 12:22:01

జబర్దస్త్ కమెడియన్ లకు వెండితెరపై కాలం కలిసి రావడం లేదు. బుల్లితెరపై వాళ్లని మ్యాజిక్కులు చేసినా కూడా వెండితెర వరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోతుంది. ఇప్పటికే చాలాసార్లు అది ప్రూవ్ అయింది.. ఇప్పుడు మరోసారి కూడా అదే జరిగింది. తాజాగా సుడిగాలి సుధీర్ అండ్ బ్యాచ్ కలిసి నటించిన త్రీ మంకీస్ సినిమా ఈ వారమే విడుదలైంది. ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ కు కూడా చిరంజీవిని పిలిచి మరి హంగామా చేశారు సుధీర్ అండ్ బ్యాచ్. కానీ కనీసం ఈ సినిమా వచ్చినట్టు ప్రేక్షకులకు కూడా తెలియదు. 

ఈ సినిమా కోసం రష్మి గౌతమ్ రోజా శేఖర్ మాస్టర్ లాంటి వాళ్లు కూడా వచ్చి ప్రమోషన్ చేశారు. అయితే ఎంత మంది ప్రమోషన్ చేసినా కూడా సినిమాలో విషయం లేకపోతే ప్రేక్షకులు పట్టించుకోరని మరోసారి ఈ సినిమా విషయంలో ప్రూవ్ అయ్యింది అంటున్నారు విశ్లేషకులు. నాసిరకం కథతో అక్కడక్కడా జబర్దస్త్ కామెడీతో వచ్చిన త్రీ మంకీస్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయినట్లు కనిపిస్తోంది. 

దాంతో జబర్దస్త్ కమెడియన్ లకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. రెండు నెలల కింద సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అది మర్చిపోకముందే ఇప్పుడు మరో ఫ్లాప్ కూడా ఆయన ఖాతాలో చేరిపోయింది. దాంతో ఇప్పట్లో సినిమాలు మానేసి ఇక పూర్తిగా జబర్దస్త్ సమయం కేటాయించాలని చూస్తున్నాడు సుడిగాలి సుధీర్. దాంతోపాటు ఎలాగా టీవీ షోలు కూడా చాలానే ఉన్నాయి. 

More Related Stories