English   

సుకుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత..

Samantha
2020-02-08 12:34:20

తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ కు దర్శకుడిగా ఎంత మంచి పేరు ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కించిన సినిమాలే ఆయన టాలెంట్ ఏమిటి అనేది చూపిస్తాయి. ముఖ్యంగా రామ్ చరణ్ తో తెరకెక్కించిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా రికార్డులన్నింటినీ ఇది తిరగరాసింది. ఈ సినిమాలో సమంత అక్కినేని రామలక్ష్మి పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ అద్భుతమే. 

ఇక ఎప్పుడు రంగస్థలం సినిమాపై.. ఆ దర్శకుడిపై.. అందులో తన పాత్రపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సమంత అక్కినేని. నిజానికి రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ కాదు. అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఒక షెడ్యూల్ కూడా ప్లాన్ చేసిన తర్వాత పారితోషికం విషయంలో తేడాలు వచ్చి ఆమెను పక్కనపెట్టి సమంతను తీసుకున్నాడు దర్శకుడు సుకుమార్. అయితే ఈ సినిమాలో కి సమంత వచ్చినా కూడా పూర్తి కథ మాత్రం తెలియదు అంటోంది ఈ ముద్దుగుమ్మ. 

సినిమా విడుదల అయ్యేంత వరకు కూడా కథ గురించి తనకు తెలియదని.. కేవలం తన పాత్ర వరకు మాత్రమే చెప్పాడు అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఆయనపై ఉన్న నమ్మకంతో కథ ఎలా ఉంటుంది అనేది కూడా అడగలేదని చెబుతుంది ఈ భామ. తాజాగా జాను సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ విషయాన్ని బయట పెట్టింది సమంత అక్కినేని. ఇది విన్న తర్వాత అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్లకు కూడా దర్శకులు ఇంకా పూర్తి కథ చెప్పకుండా కేవలం పాత్రల వరకు మాత్రమే చెప్తున్నారా అంటూ ఫాన్స్ డైలమాలో పడిపోయారు. దర్శకుల పనితీరు నచ్చినప్పుడు కథతో అవసరం లేదు అంటుంది సమంత అక్కినేని. 

More Related Stories