English   

బాలయ్య  బోయపాటి సినిమా నుండి ఆసక్తికర అప్డేట్

Balakrishna
2020-02-08 13:49:34

సూపర్ హిట్ కాంబినేషన్‌గా పేరొందిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనులు ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ జనవరి 3 నుంచి మొదలు కావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వలన ఆ సినిమా వాయిదా పడింది, ఆ తర్వత బోయపాటి తల్లి మరణించడంతో ఆ సినిమా షూటింగ్ ఈ నెల 26న మొదలు కానుంది. 

ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తారని చెబుతున్నారు. బాలకృష్ణ సరసన నయన తార, శ్రియ నటించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బాలకృష్ణ నటించిన సింహా సినిమాలో నయన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక శ్రియ కూడా బాలకృష్ణతో మూడు సినిమాల్లో నటించారు. ఇక ఈ ఇద్దరు భామలతో బాలయ్య చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లను అందుకున్నాడు. 

ఇక ఆ సెంటిమెంట్ తో బాలయ్య బోయపాటి సినిమాకు వీరిని ఎంపిక చేశారని చెబుతున్నారు. ఫిబ్రవరి 26నుంచి వారణాసిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు కోణాలున్న పాత్రలో నటిస్తారట. ఇక సినిమాలో కొన్ని సీన్స్ లో బాలయ్య అఘోరాగానూ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ?

More Related Stories