English   

క్రికెటర్ తో అనుష్క పెళ్లి..క్లారిటీ ఇచ్చేసింది !

anu
2020-02-09 10:46:18

సెలబ్రిటీల విషయంలో ఏ చిన్న వార్త బయటకొచ్చినా అది ఎంతగా వైరల్ అవుతుంది అంటే ఒక్కో సారిస్ అదరు సెలబ్రిటీ కూడా ఆశ్చర్యపోతుంటారు. ఏంటి ఇది నిజేమేనా ఏమిటి ? అని. అలా వైరల్ అయ్యే వార్తల్లో వారి వారి పెళ్లి వార్తలు ఒకటి. ప్రస్తుతం కన్నడ భామ తెలుగు సినిమాల్లో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి విషయంలో ఇదే జరుగుతుంది. అనుష్క టీమిండియా క్రికెటర్‌ ఒకరిని ను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం రెండు రోజుల నుండి ఊపందుకుంది. ఆ ఆటగాడు పేరు చెప్పకుండా ఉత్తరాదికి చెందిన వ్యక్తనే వివరంతో వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇందులో ఎంతనిజం ఉందో తెలీదు కానీ అభిమానుల్లో సందడి నెలకొంది. 1981 లో జన్మించిన అనుష్క ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ మధ్య ప్రభాస్ తో పెళ్లి అనే వార్త బయటకు రావడంతో ఆమె నటించే సినిమాల కంటే.. పెళ్లి విషయమే జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. గతంలో హీరో ప్రభాస్ తో పెళ్లి విషయం మీద ఇద్దరూ ఖండించారు. కాబట్టి అది అక్కడితో ఆగింది. ఈ ప్రచారం కూడా ఆగాలంటే స్పందించాలని భావించిన అనుష్క తాజాగా ఆ విషయం మీద స్పందించినట్టు సమాచారం. తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్న మాట వాస్తవమే అయినా క్రికెటర్ తో పెళ్లి కుదిరిందని అనే వార్తలో అసలు వాస్తవం లేదని సన్నిహితుల వద్ద వాప్యినట్టు సమాచారం.

More Related Stories