ప్రభాస్ సినిమాలో అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో

బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయిన హీరో ప్రభాస్. ఆ సినిమా తర్వాత ఎన్నో అంచనాలతో తీసిన సాహో సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆయన జిల్ ఫేం రాధాకృష దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘జాన్’. అయితే అధికారికంగా ఈ పేరును ఇంకా నిర్ణయించలేదు. కానీ యూవీ వాళ్ళు రెండు టైటిల్స్ రిజిస్టర్ చేశారు. అందులో ఒకటి ఓ డియర్ కాగా మరో కటి రాధే శ్యాం. ఇక టైటిల్స్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా గురించి మరో తాజా గాసిప్ బయటకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో అలనాటి బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి నటించనున్నారని సమాచారం. నిజానికి ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న నేపధ్యంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కూడా ఓ పాత్ర పోషిస్తోన్న విషయం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మిథున్ చక్రవర్తి కూడా నటిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకప్పుడు డిస్కోకింగ్ గా బాలీవుడ్ సినిమాలో ఆయన హీరోగా పేరు సంపాదించాడు. అయితేతెలుగు సినిమాల్లో మిథున్ చక్రవర్తి నటించడం కొత్తేమి కాదు. అయితే ఈ సినిమాలో మిథున్ పాత్ర ఎలా ఉంటుందనే దాని మీద ఆసక్తి నెలకొంది. పవన్ వెంకటేష్ ల ‘గోపాల గోపాల’ చిత్రంలో లీలాధర్ స్వామిజీగా నటించిన ఆయన మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమాలో ఏం మాయ చేస్తారో ?