English   

బంగార్రాజుకి ముహూర్తం కుదిరేసింది

nag
2020-02-09 11:53:29

‘మన్మథుడు 2’ సినిమా లాంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ అనే కాప్ ఓరిఎంటెడ్  మూవీకి కమిట్ అయ్యాడు. మహర్షి సినిమాకి రచయితగా పని చేసిన సాల్మన్ అనే వ్యక్తిని ఈ సినిమా సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. విజయ వర్మ అనే ఒక ఎన్ఏఐ ఆఫీసర్ జీవిత కథనే సినిమాగా మలుస్తున్న ఈ సినిమా షూట్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. అయితే కరోనా దెబ్బకి షూట్ కొంచెం ఆగింది. ఇక మరో పక్క ఆయన నటిస్తున్న బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండూ కాకుండా నాగ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ని త్వరలోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన “సోగ్గాడే చిన్ని నాయనా” 2016లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఆయన్నే ఫైనల్ చేశారట. స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసిన కళ్యాణ్ కృష్ణ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టాడని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఈ ఏడాది ఉగాది రోజున ‘బంగార్రాజు’ చిత్రాన్ని మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారట అన్నపూర్ణ వారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించే అవకాశాలున్నట్టు సమాచారం.  

 

More Related Stories