కమెడియన్ అలీని పవన్ కళ్యాణ్ కావాలనే దూరం పెడుతున్నాడా..

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే అలీ అక్కడ కనిపించే వాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. చేసిన 25 సినిమాలలో రెండు మినహా అన్నింట్లోనూ అలీ కూడా ఉన్నాడు. దీన్ని బట్టి పవన్ అలీ స్నేహం ఎంతో అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయాల్లో కి వెళ్ళిన తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఆయన జనసేన కాకుండా వైసీపీలో జాయిన్ అవ్వడం పవన్ కళ్యాణ్ కు ససేమిరా నచ్చలేదు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అలీ పై చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. కానీ అవన్నీ రాజకీయాలు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఇద్దరూ స్నేహితులుగానే ఉంటారని అనుకున్నారంతా. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడు సినిమాలు చేస్తున్నా అందులో ఏ ఒక్క దానిలో కూడా అలీ కనిపించడం లేదు. కనీసం ఆయనను నటించమని ఎవరు అడగలేదు. ఇదే విషయాన్ని కమెడియన్ అలీ కూడా మీడియా ముందే కన్ఫర్మ్ చేశాడు.
పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం తనకు ఆనందాన్ని ఇస్తుందని.. అయితే ఆయన సినిమాల్లో నటించాలని అంటూ తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పాడు. ఒకవేళ అడిగితే మాత్రం కచ్చితంగా స్నేహితుడు సినిమాలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.. సినిమాలు రాజకీయాలు వేరు దయచేసి పెట్టవద్దు అంటున్నాడు ఈ కమెడియన్. దీన్నిబట్టి పవన్ నటిస్తున్న సినిమాలో అలీకి ఎలాంటి క్యారెక్టర్స్ లేవని అర్థమైపోయింది. మరి కనీసం హరీష్ శంకర్ సినిమాలో అయినా కమెడియన్ అలీ కనిపిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కూడా రాజకీయాల కారణంగా ఇద్దరు స్నేహితులు విడిపోవడం మాత్రం అభిమానులకు అసలు నచ్చడం లేదు.