English   

అల్లు అర్జున్ డాన్స్ కి పాన్ ఇండియా క్రేజ్.. బాలీవుడ్ లో బుట్ట బొమ్మ..

bomma
2020-02-09 15:16:48

అల్లు అర్జున్ అంటే కేవలం తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో మంచి క్రేజ్ ఉంది. ఇక ఈయన సినిమాలు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అల్లు అర్జున్ అంటే హిందీ ఆడియన్స్ కు కూడా బాగానే పరిచయం. వాళ్లకు కూడా అల్లు అర్జున్ అని పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది డాన్స్. ఆ కుర్రాడు ఎవరు డాన్సులు బాగా చేస్తాడు.. అతనే కదా అల్లు అర్జున్ అంటే అంటూ ముంబైలో కూడా అల్లు వారబ్బాయిని బాగానే గుర్తు పడతారు. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది. ఈ మధ్యే విడుదలైన అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలు ఎంత పెద్ద విజయం సాధించగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందులో బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే అంటూ సాగే మెలోడీ సాంగ్  ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. ఈ సాంగ్ బయట కంటే కూడా టిక్ టాక్ లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ ను టిక్ టాక్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ ను టిక్ టాక్ చేసి చేసింది. దాంతో ఈ పాట ఏకంగా బాలీవుడ్ లో కూడా ఊపేస్తుంది ఇప్పుడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాంగ్ ఎంతటి పావులర్ అయ్యిందో. బుట్టబొమ్మ సాంగ్ కి టిక్ టాక్ లో  దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. టిక్ టాక్ లో తెలుగు పాట ఇంతగా సంచలనం సృష్టించడం ఇదే తొలిసారి.

More Related Stories