నాగేశ్వరరావుగా నాగ చైతన్య

గత ఏడాది `మజిలీ`, `వెంకి మామ` సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ చూశాడు నాగచైతన్య. ఈ నేపథ్యంలో చైతూ నుంచి రాబోయే చిత్రాలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే… చైతూ నుంచి ఈ ఏడాది రాబోతున్న రెండు సినిమాలను కూడా ప్రీవియస్ మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకులే తెరకెక్కిస్తున్నారు. చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్ `లవ్ స్టోరి`ని 2017లో `ఫిదా` వంటి బ్లాక్ బస్టర్ ని రూపొందించిన శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండగా ఆ తర్వాత వచ్చే సినిమాని 2018లో `గీత గోవిందం` వంటి సంచలన విజయాన్ని అందించిన పరశురామ్ రూపొందిస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. దీన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ హిట్ బొమ్మ `చిచ్చోరే` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నాగచైతన్యకు జోడీగా కీర్తిసురేష్ని ఎంపిక చేశారని కూడా అంటున్నారు. ఇందులో నిజం ఎంతుందో కానీ ఈ సినిమాకి టైటిల్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా పెట్టారట. ఈ సినిమాకి `నాగేశ్వరరావు` అనే పేరు బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారని అంటున్నారు. దానికి ఊతం ఇచ్చేలాగా ఈ సినిమా టైటిల్ ని 14 రీల్స్ బ్యానర్ వాళ్ళు ఫిలి ఛాంబర్ లో రిజిస్టర్ చేశారు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే బయటికి రానుందని చెబుతున్నారు.