అఖిల్ మీద ట్రోల్స్ తో విరుచుకుపడుతున్న నెటిజన్లు

అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు నాలుగేళ్లు అయిపోయినా ఇప్పటి వరకు మనోడికి చెప్పుకోదగ్గ సినిమా కూడా హిట్ కొట్టలేదు. కథల ఎంపిక విషయంలో వేస్తున్న తప్పటడుగులో లేక మనోడి దరిద్రమో తెలీదు కానీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలతో హిట్ కొట్టలేకపోయిన అఖిల్.. ఈసారి బొమ్మరిల్లు భాస్కర్‌తో కలిసి పెద్ద హిట్ కొట్టేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏడడుగులు ఎప్పుడైనా నడవాల్సిందే కదా!! అందుకే.. ‘’అంటూ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ ఫస్ట్‌లుక్ ను నిన్న విడుదల చేశారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’గా ఏడు అడుగుల్లో నా మొదటి అడుగు ఇదిగో.. ఏప్రిల్‌లో థియేటర్స్‌లో కలుసుకుందాం’ అంటూ ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు అఖిల్. ఎక్కడో ఫారెన్ లో రోడ్డు మీద నిట్ క్యాప్, మెడలో స్కార్ఫ్ ధరించి, పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తున్న అఖిల్ లుక్ మీద రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ అతారింటికి దారేది లాగా అఖిల్ అమ్మాయింటికి దారేది అనే సినిమా చేస్తున్నాడా అని కొందరు, అసలు అఖిల్ లానే లేడు అని మరొకొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీ వాస్, వాసు వర్మలు నిర్మిస్తున్నారు.