English   

మళ్ళీ వార్తల్లోకి యాంకర్ రవి..పోలీస్ కేస్

ravi
2020-02-10 05:01:15

ఎప్పుడూ వివాదలాతోనే వార్తలలో నిలిచే యాంకర్ రవి మరో సారి వార్తలలోకి ఎక్కాడు. సినిమా ఇండస్ట్రీకి చెందిన సందీప్ అనే వ్యక్తిపై టాలీవుడ్ యాంకర్ రవి కుకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో సందీప్ అనే వ్యక్తి 45 లక్షలు అప్పుగా తీసుకుని అవి తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడంటూ రవి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో 45 లక్షలు అప్పుగా తీసుకున్న సందీప్ ఆ తర్వాత కొద్ది రోజులకి కొంత డబ్బు తిరిగిచ్చాడని మిగతా డబ్బులు ఇవ్వాలని అడగ్గా ఇవ్వను ఏమి చేసుకుంటావో చేసుకో పొమ్మని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో రవి పేర్కొన్నట్టు చెబుతున్నారు. అక్కడితో ఆగక తాను ఎక్కడికెళ్లినా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను సందీప్ బెదిరిస్తున్నాడని రవి చెప్పుకొచ్చాడు. అయితే తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్ వారిని కూడా ఇలాగే మోసం చేశాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

 

More Related Stories