English   

రామోజీ ఫిల్మ్ సిటీలో పేలుడు .. అసలేమయింది ..

ramoji
2020-02-10 05:12:12

రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ సినిమా సెట్టింగ్ లో పేలుడు సంభవించినట్టు సమాచారం. ఈరోజు ఉదయం కొత్తపేటలో సాయి సంజీవని ప్రయివేట్ ఆసుపత్రికి తీవ్రంగా కాలిన గాయాలతో గల ఓ వ్యక్తిని తీసుకొచ్చి చేర్చారు. చేరిన వ్యక్తి పేరు రావ్ సాబ్ కాగా ఆయన వయస్సు సుమారు 48 సంవత్సరాలు ఉన్నట్టు చెబుతున్నారు. మహారాష్ట్రకు చెందిన రావ్ సాబ్ సినిమా సెట్టింగ్ పనులకు సంబంధించిన కార్మికుడని అంటున్నారు. ఈ తెల్లవారు జామున ఆయన పనిచేస్తున్న ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు వలన రావ్ సాబ్ తీవ్రంగా గాయపడ్డాడు. యాభై శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన రావ్ సాబ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పొట్ట కూటికోసం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు వచ్చిన అనేక మంది కార్మికుల్లో రావ్ సాబ్ కూడా ఒకరు, సినిమా సెట్టింగులకు సంబంధించి ప్లాస్టిక్ షీట్ల అతికింపు పనుల్లో వీళ్లు పనిచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలా ఒక సెట్ కోసం పని చేస్తున్న సమయంలోనే 'పేలుడు' జరిగి రావ్ సాబ్ తీవ్రంగా గాయపడ్డారనేది ప్రాథమిక సమాచారం. అయితే ఈ సంఘటన బయటకి రాలేదు. ఈ విషయాన్ని సదరు సినిమా సెట్టింగ్ నిర్వహణ సంబంధీకులు గోప్యంగా ఉంచడానిక గల కారణాలేమిటి ? పేలుడు ఘటనకు దారి తీసిన పదార్థాలేమిటి ? వంటి అనేక ప్రశ్నలు సందేహలుగా మిగిలిపోయాయి. కాగా తీవ్రంగా గాయపడిన రావ్ సాబ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు కూడా ధృవీకరించాయి.

More Related Stories