English   

ఏపీ పాలిటిక్స్ ఫాలో అవుతున్న రజనీ...మనోళ్ళలానే

rajni
2020-02-10 05:38:35

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారయిందని అంటున్నారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరి మద్దతు తీసుకోవాలి అనేదానిపై రజనీ ఓ క్లారిఫికేషన్ కొచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏపీలో లాగా 2021 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన పాదయాత్ర కూడా చేపట్టనున్నారని అంటున్నారు. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తమిళనాట ఇదే హాట్ టాపిక్ అన్నా ఆశ్చర్యం లేదేమో. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత రజనీకాంత్ కొత్త పార్టీ ప్రారంభిస్తారని తమిళనాట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అధికారమే లక్ష్యంగా రజనీ పక్కా ప్రణాళికతో ముందుకు కదలనున్నారని, పీఎంకెతో పొత్తు పెట్టుకోవాలని, బయటి నుంచి బీజేపీ మద్దతు తీసుకోవాలని కూడా రజనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తుగ్లక్ మ్యాగజైన్ వార్షికోత్సవాల్లో పెరియార్‌పై రజనీ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని, పార్టీ స్థాపనకు ముందు, తన స్టాండ్ ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలియచేసేందుకే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే రాజకీయనేతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు రజనీ కాంత్ ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేసే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు. అలాగే రజనీ ప్లాన్ లో భాగంగా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అధికార పార్టీ ఏఐఏడీఎంకె నేతలు రజనీకాంత్‌ పార్టీలో చేరే అవకాశముందని కూడా అంటున్నారు.

More Related Stories