English   

చరణ్, విజయ్ లను ఆకాశానికి ఎత్తేసిన ఇన్ఫోసిస్ సుధామూర్తి

Ram Charan Vijay Devarakonda.jpg
2020-02-10 10:41:44

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఆయనకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. చరణ్ ను నటనాపరంగా విమర్శించిన వాళ్ళు కూడా ఆ సినిమా దెబ్బకు పూర్తిగా ఆయనకు ఫిదా అయిపోయారు. అంత గొప్పగా చరణ్ నటన ఉంది. చరణ్ కు ఈ సినిమా వలన అనేక మంది ప్రశంసలు దక్కాయి. అయితే 2018లో విడుదలైన సినిమా గురించి ఇప్పుడు ప్రస్తావన ఎందుకా అంటే రామ్‌చరణ్‌, సమంత నటించిన తెలుగు సినిమా 'రంగస్థలం'ను తాను చూశానని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి తెలిపారు. ఆ సినిమా అద్భుతంగా ఉందని ఆమె ప్రశంసించారు. ఆ సినిమాలో రామ్‌చరణ్‌ నటన చాలా బాగుందని ఆమె చెప్పుకొచ్చారు.

అలాగే, తాను నాగార్జున సినిమా 'మనం' కూడా చూశానని, తాను కన్నడ సినిమాలు కూడా బాగా చూస్తానని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె సినిమాలతో పాటు ఎన్నో విషయాలు తెలిపారు. ఇక తన చిన్నతంలో ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు అంటే ఎంతో ఇష్టపడి చూసేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మాయా బజార్, దాన వీర శూర కర్ణ, సీతా రామ కళ్యాణం వంటి సినమాలంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగు చిత్రాలతో పాటు కన్నడ సినిమాలను కూడా ఎక్కువగా వీక్షిస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అంతేకాక గీత గోవిందం సినిమా చూసి విజయ్ కి అభిమానిగా మారానని కూడా ఆమె చెప్పుకోచ్చింది.

More Related Stories