యాంకర్ అనసూయ మార్ఫింగ్ ఇమేజెస్..పోలీసులకి ఫిర్యాదు

జబర్దస్త్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయట. ఆమె ఫోటో పెట్టి కొందరు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలు అనసూయకు మానసిక వేదన కలిగిస్తుండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ కి కూడా ఫిర్యాదు చేసింది. ఇక సదరు ఫిర్యాదుపై సైబర్ క్రైమ్స్ పీఎస్ హైదరాబాద్ సిటీ పోలీస్ వారు కూడా స్పందించారు. దీంతో అనసూయ పోలీసులకి ధన్యవాదాలు తెలిపింది. నిజానికి అనసూయ వస్త్రధారణపై ట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది సోషల్ మీడియాలో.
ఈ విషయంలో అనసూయ కూడా చాలా సార్లు ఇదే సోషల్ మీడియా విశాతంలో అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. తన వృత్తికి పూర్తి న్యాయం చేయడానికి తాను అలాంటి డ్రెస్సులు వేసుకోక తప్పదని ఎన్నోసార్లు ఆమె చెబుతూ ఉంటుంది. ఈ మధ్య ఆమె చీరకట్టులో జాకెట్టు లేకుండా ఉన్నట్టున్న పిక్ కూడా హల్చల్ చేస్తోంది. అది కొంచెం అసభ్యకరంగా ఉండడమే ఈ వ్యవహారానికి కారణం అని అంటున్నారు.