English   

జాన్వీ కపూర్...ఆసక్తికర వ్యాఖ్యలు

Jhanvi Kapoor.jpg
2020-02-10 14:42:14

ప్రముఖ సినీనటి శ్రీదేవి కుమార్తెలు జాన్వీకపూర్‌, ఖుషికపూర్‌ తమ స్నేహితులతో కలిసి అలిపిరి మార్గంలో కాలినడకన నిన్న రాత్రి 11 గంటల సమయంలో తిరుమల చేరుకున్నారు. తిరుమల పద్మావతినగర్‌లోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహంలో బసచేసిన వీరు సోమవారం ఉదయం ప్రారంభ సమయంలో శ్రీవారిని దర్శించుకొన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఆసకక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తొలి సినిమా ‘ధడక్’ విడుదలైన తర్వాత తన దగ్గరకు వచ్చిన అభిమానులు దీని గురించి, అందులో తన నటన గురించి ప్రశంసలు కురిపించే వారని, ఇప్పుడేమో తన జిమ్ దుస్తుల గురించి ప్రస్తావిస్తున్నారని, ఇది కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ, వారిని తప్పుబట్టలేమని జాన్వీ చెప్పుకొచ్చింది. భవిష్యత్ లో తాను ధరించే దుస్తుల గురించి కాకుండా తన సినిమాల గురించి మాట్లాడుకుంటారని అనుకుంటున్నానని జాన్వీ చెప్పుకొచ్చింది.

జాన్వీకపూర్ తొలి చిత్రం ‘ధడక్’ విడుదలై దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఇక ఆమె ఐఏఎఫ్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. ఈ మధ్య ఆమె ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ చేసింది జాన్వీ.

More Related Stories