English   

దిల్ రాజు రెండో పెళ్లి... త్వరలోనే పూర్తి వివరాలు...

Dil Raju.jpg
2020-02-10 15:55:25

ప్రముఖ నిర్మాత దిల్ రాజు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఈయన మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నా కూడా ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం వీలైనంత త్వరగా ఈయన మరోసారి ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తుంది. దీనికోసం ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే అమ్మాయిని కూడా చూసుకున్నాడని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా బయటికి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల కింద రాజుగారి భార్య అనిత అనారోగ్యంతో చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత పూర్తిగా ఒంటరి అయిపోయాడు రాజు. సినిమాలతో కాలక్షేపం చేస్తున్నా కూడా తోడు కావాలని సన్నిహితులు నచ్చచెప్పడంతో ఈయన మరో పెళ్లి చేసుకోడానికి ఒప్పుకున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే ఈయన పెళ్లి గురించి ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రాజు గారి కుటుంబం మాత్రం చాలా సస్పెన్స్ మెయింటేన్ చేస్తుంది. ఇండస్ట్రీతో సంబంధం లేని అమ్మాయితోనే దిల్ రాజు ఏడడుగులు నడవబోతున్నాడని తెలుస్తుంది. ఈయన పెళ్లికి ఇప్పటికే కుటుంబం నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా కూతురు మాత్రం ఇంకా సైలెంట్ గా ఉందని.. ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాడని చెబుతున్నారు సన్నిహితులు.

ఈ పెళ్లి కూడా ఎలాంటి సందడి లేకుండా సైలెంట్ గా జరగబోతుందని తెలుస్తుంది. ఏదేమైనా కూడా తోడు కోసం దిల్ రాజు మళ్లీ పెళ్ళి చేసుకోనుండటం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతుంది.

More Related Stories