English   

పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా..

pk
2020-02-11 07:16:07

రాజకీయాలను ప్రస్తుతం పక్కనపెట్టి సినిమాలతో పవన్ కళ్యాణ్ మళ్లీ బిజీ కావడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఎప్పుడూ ఒకసారి ఒక సినిమా కంటే ఎక్కువ కమిట్ అవ్వని పవర్ స్టార్.. రీ ఎంట్రీ లో మాత్రం ఒకేసారి మూడు సినిమాలకు  పచ్చజెండా ఊపేశారు. అందులో పింక్ సినిమా రీమేక్ మే 15న విడుదల కానుంది. ఈ సినిమా గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక దాంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా పైనే అందరి కళ్లు ఉన్నాయి. పైగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇందులో పవన్ పాత్ర పేరు వీర అని అంటున్నారు. అంతేకాదు  పవన్ పేరు కలిసొచ్చేలా ఈ సినిమాకు 'విరూపాక్షి' అనే టైటిల్ పెడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. అందులో ఒక పాత్రకు ఇంతకుముందు కియారా అద్వానీ పేరు ప్రచారంలోకి రాగా.. ఇప్పుడు కీర్తి సురేష్ పవన్‌తో జోడీ కడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్ తో ఒకసారి జోడి కట్టాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరోసారి ఈ జోడి రిపీట్ చేయాలని చూస్తున్నాడు క్రిష్. అన్నట్లు సినిమాలో అనసూయ భరద్వాజ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 18వ శతాబ్దపు పాలమూరు పండుగ సాయన్న అనే ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ బాగానే కష్టపడుతున్నాడు. పవన్‌తో 'ఖుషి' లాంటి సంచలన సినిమాను నిర్మించిన ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలోనే షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 25 కోట్లు ఖర్చు చేసి తాజ్ మహల్, చార్మినార్ సెట్స్ నిర్మించారు. అన్నీ కుదిరితే ఇదే ఏడాది పవన్ క్రిష్ సినిమా విడుదల కానుంది.

More Related Stories