English   

నితిన్‌ పెళ్లి...క్లారిటీ వచ్చేసింది !

nithin
2020-02-11 07:59:12

ప్రముఖ కథానాయకుడు నితిన్‌ కి పెళ్లి ! ఇప్పుడు టాలీవుడ్ లో రన్ అవుతున్న ట్రేండింగ్ అంశాల్లో ఇదొక్కటి.  షాలిని అనే అమ్మాయిని చాలా ఏళ్లుగా ప్రేమిస్తున్న నితిన్ ఆ విషయాన్ని ఇంట్లో చెప్పి అందరినీ పెళ్లికి ఒప్పించాడని ఈ ఏడాదిలోనే అతడికి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రచారం అయితే జరుగుతోంది కానీ ఇప్పటిదాకా ఈ విషయం మీద అధికారిక ప్రకటన కానీ ఖండన కానీ రాలేదు. అయితే తాజాగా ఈ విషయం మీద నితిన్ క్లారిటీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఒక లీడింగ్ మీడియా గ్రూప్ ప్రతినిధికి నితిన్ ఈ విషయాన్ని ఖరారు చేసినట్టు చెబుతున్నారు. లండన్‌ లో చదువుకున్న షాలిని 2012లో తనకి పరిచయమైందని, ఆ తరవాత స్నేహితులుగా మారి ఆ తర్వాత కొద్ది రోజులకి ఒకరిని ఒకరం ఇష్టపడ్డామని నితిన్ పేర్కొన్నట్టు సమాచారం. ఈ విషయం ఇంట్లో చెప్పగా వాళ్ళు కూడా సంతోషంగా మా పెళ్లికి అంగీకరించారని నితిన్ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 16న వీరి పెళ్లి జరగనుండగా ఈ పెళ్లి వాయిదా అని కూడా ప్రచారం జరుగుతోంది. పని ఒత్తిడి కారణంగా ఏప్రిల్ లో పెళ్లి పెట్టుకోలేకపోతున్నట్లు ఈ ప్రచారం జరిగింది. దుబాయ్ లో పలాజో వర్సాచే హోటల్ లో నితిన్ పెళ్లి జరగనుంది.

 

More Related Stories