English   

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ షాకింగ్ రెమ్యునరేషన్..

vijay
2020-02-11 08:47:49

విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన డేట్స్ కోసం స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఈయనకు ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఒక్కో సినిమాకు కనీసం 6 నుంచి 8 కోట్ల వరకూ పారితోషకం అందుకోవడం ఖాయం. అలాంటిది ప్రస్తుతం ఆయన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం చాలా తక్కువ పారితోషికం అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా అర్జున్ రెడ్డి విడుదలైన తర్వాత కమిట్ అయ్యాడు విజయ్. అప్పట్లో ఆయనకు ఉన్న క్రేజ్ ప్రకారం ఈ సినిమాకు దాదాపు కోటి రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నాడని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి విడుదలైన కొత్తలోనే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండకు నిర్మాత కేఎస్‌ రామారావు అడ్వాన్స్ ఇచ్చేశాడు. ఆ తర్వాత మిగిలిన మొత్తం కూడా కలుపుకుంటే  కేవలం కోటి రూపాయలతోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు విజయ్. కానీ ఈ మూడేళ్లలో చాలా మారిపోయింది. ప్రస్తుతం ఆయనకు ఉన్న క్రేజ్‌కు 6 నుంచి 8 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నాడు.

అలాంటిది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం చాలా అంటే చాలా తక్కువ పారితోషికం దక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా ప్రమోషన్ కూడా విజయ్ దేవరకొండ దూరంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ సినిమా గురించి విజయ్ పెద్దగా పట్టించుకోవడం లేదని.. పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమాతో ప్రస్తుతం ఈయన బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. కావాలనే వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా జరుగున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో మూడు పాత్రల్లో విజయ్‌ దేవరకొండ నటించాడు. వరల్డ్ ఫేమస్ లవర్ లో నలుగురు హీరోయిన్స్ తో ఈయన రొమాన్స్ చేశాడు. ఏదేమైనా అనుకున్న పారితోషికం కంటే చాలా తక్కువ దక్కడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి 14న తక్కువ అంచనా వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలవుతుంది.

More Related Stories