English   

రాహుల్ సిప్లిగంజ్ కు షాక్ ఇచ్చిన పునర్నవి 

Punarnavi Bhupalam
2020-02-11 10:41:42

బిగ్ బాస్ 3 పుణ్యమా అని రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం బాగా ఫేమస్ అయ్యారు. వాళ్ళు ఆడిన గేమ్ కంటే కూడా వాళ్ళ రొమాన్స్ ఎక్కువగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ ఇద్దరి రొమాన్స్ కారణంగానే బిగ్ బాస్ షోలో చివరివరకు పునర్నవి ఉంది. ఇక రాహుల్ అయితే ఏకంగా విన్నర్ అయ్యాడు. దాంతో వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. పైగా ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం కూడా జరిగింది. దీనిపై రాహుల్ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు. 

ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే పెళ్లి చేయడానికి తమకేమీ అభ్యంతరం లేదు అంటూ రాహుల్ సిప్లిగంజ్ తల్లి చెప్పడంతో నిజంగానే పునర్నవి ప్రేమలో ఉన్నాడని ప్రచారం బాగా జరిగింది. కానీ ఎప్పటికప్పుడు పునర్నవి మాత్రం ఈ విషయం దాటవేస్తూనే ఉంది. రాహుల్ సిప్లిగంజ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే.. అంతకు మించి ఇంకేమీ కాదని చెబుతూనే ఉంది. దానికి తోడు ఆ మధ్య బిగ్ బాస్ షోలో తనకు ఆల్రెడీ ఒక ప్రేమికుడు ఉండేవాడని.. కానీ ఒక ప్రమాదంలో ఆయన చనిపోయాడు అని చెప్పి సంచలనం సృష్టించింది. 

రాహుల్ వచ్చిన తర్వాత తన జీవితంలో జరిగిన విషాదాన్ని మరిచిపోయాను అని చెప్పడంతో వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలామంది కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ పునర్నవి ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చింది. తను హైదరాబాది కుర్రాడితో ప్రేమలో ఉన్నాను అంటూ చెప్పి రాహుల్ సిప్లిగంజ్ కు అదిరిపోయే షాక్ ఇచ్చింది. అయితే రాహుల్ కూడా పక్కా హైదరాబాద్ కుర్రాడే కదా అంటూ సోషల్ మీడియాలో కొందరు పునర్నవిని ప్రశ్నిస్తున్నారు. మీరు ప్రేమలో ఉన్న హైదరాబాది కుర్రోడు రాహుల్ సిప్లిగంజ్ అనుకోవచ్చా అంటూ ఆమెను అడుగుతున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి ప్రేమాయణం చూస్తుంటే ఎక్కడ ఆగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. 

More Related Stories