English   

ప్రభాస్‌ చేజింగ్ కోసం చెరువు.. ట్రైన్..

 Prabhas
2020-02-11 11:04:17

బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచ వ్యాప్తంగా భీభత్సంగా పెరిగిపోయింది. ప్రభాస్ సినిమా అంటే చాలు.. ఫలితంతో పనిలేకుండా థియేటర్ల ముందు వాలిపోతున్నారు ఆడియెన్స్. ఇందుకు ఉదాహరణగా సాహో సినిమానే చెప్పుకోవచ్చు. రివ్యూలతో సంబంధం లేకుండా కలెక్షన్ల పరంగా దుమ్ము రేపింది సాహో. అయితే ప్రభాస్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో కొంత నిరాశ చెందాడు. 

దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు రెబల్ స్టార్. ప్రస్తుతం జిల్ ఫేమ్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆన్ సెట్స్ పై ఉన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను ఏర్పాటు చేశారట. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ఓ ఎకరం స్థలంలో ప్రత్యేకంగా ఒక చెరువును ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

ఈ సినిమాలో వాటర్‌లో ఉండే ఓ చేజింగ్ సీన్ కోసం చెరువు సెట్ ను ఆర్ట్ డైరెక్టర్‌ రవీందర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేశారట. అంతేకాదు అక్కడే ఓ ట్రైన్‌ సెట్‌ కూడా ఏర్పాటు చేశారట. ఇకపోతే ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక టైటిల్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు జాన్ అనే పేరు వినిపించింది.. కానీ ఆ టైటిల్ మారినట్టు సమాచారం. అందులోభాగంగానే.. ఓ డియర్, రాధే శ్యామ్.. అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు వినిపిస్తోంది. 

More Related Stories