English   

సీనియర్ జర్నలిస్ట్ పసుపులేని రామారావు కన్నుమూత..

Pasupuleti Ramarao
2020-02-11 13:42:43

తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు సినిమాతో ఈయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలోనే పెనవేసుకొని ఉన్నారు పసుపులేటి రామారావు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు తెలుగు సినిమా ప్రముఖులు. ముఖ్యంగా మెగా కుటుంబంతో ఆయనకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. మెగాస్టార్ చిరంజీవిపై ఆయన పుస్తకాలు కూడా రాశారు. 

ముఖ్యంగా ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి 150 సినిమాల ప్రయాణంపై ఈయన రాసిన చిరంజీవితం పుస్తకం చాలా బాగా హైలైట్ అయింది. తెలుగు సినిమా సీనియర్ హీరోల అందరిని ఇంటర్వ్యూలు చేశారు పసుపులేటి రామారావు. 80వ దశకం నుంచి కూడా ఈయన సినిమాలతో మమేకమై ఉన్నారు. రామారావు మృతి పట్ల జర్నలిస్టులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పత్రికా లోకానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 

ఆయన మొదట విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్ట్‌గా పనిచేసారు. ఆ తర్వాత జ్యోతిచిత్ర పత్రికకు కూడా కొంతకాలం పనిచేసారు. ప్రస్తుతం సురేష్ కొండేటి 'సంతోషం' సినీ పత్రికకు జర్నలిస్ట్‌‌గా పనిచేస్తున్నారు. పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు. డిగ్రీ పూర్తిచేసిన ఆయన.. ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ మెంబర్‌గానూ ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని చంద్రమోహన్, మురళీ మోహన్, మోహన్ బాబు ఇలా ఈ తరం వరకు కూడా అందరితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న జర్నలిస్ట్ ఈయన.

More Related Stories