English   

ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టింది వీరే 

Oscar Winners
2020-02-11 15:24:57

బెస్ట్ యాక్టర్

2020 ఆస్కార్ పురస్కారాల్లో బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ పురస్కారం అందుకున్నాడు జోక్విన్ ఫోనిక్స్. అమెరికాకు చెందిన జోక్విన్ ఫోనిక్స్ ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. నిర్మాతగా ఎన్నో చిత్రాలు నిర్మించారు. కెరీర్‌లో రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, గ్రామీ అవార్డ్‌ను కైవసం చేసుకున్న జోక్విన్ ఫోనిక్స్‌కు ఇదే తొలి ఆస్కార్ పురస్కారం. అమెరికా టీవీ షోస్‌తో నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన జోక్విన్ ఫోనిక్స్.1986లో విడుదలైన స్పేస్ క్యాంప్ చిత్రంతో తొలిసారిగా హాలీవుడ్ స్ర్రీన్‌పై కనిపించారు. జోకర్‌ సినిమాలో నటనకు ఆస్కార్‌ అవార్డ్ అందుకున్నారు.

బెస్ట్ యాక్ట్రెస్ :

జూడీ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న రెనెజావెగర్‌ ఈ ఏడాది ఉత్తమ బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆస్కార్‌కు న నామినేట్ అయిన రెజెనావెగర్ రెండోసారి ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటులలో ఒకరిగా ఉన్న రెనెజావెగర్ ఇప్పటి వరకు నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా అందుకున్నారు. టెక్సాస్‌లో పుట్టి ఇంగ్లీష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రెనెజావెగర్ జర్నలిజంలోకి రావాలనుకుని చివరకు యాక్టింగ్ కెరీర్ ఎంచుకున్నారు.

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ :

ఉత్తమ సహాయ నటుడు విభాగంలో హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ ఆస్కార్ గెలుచుకున్నారు. బ్రాడ్ పిట్ కెరీర్‌లో ఇది రెండో ఆస్కార్ పురస్కారం.వన్స్ అప్ ఆన్‌ ఏ టైమ్‌ ఇన్ హాలీవుడ్ చిత్రంలో అద్భుత నటనకు బ్రాడ్ పిట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు. ఏ బ్యూటిఫుల్ డే ఇన్‌ ది నైబర్ హుట్ , ది టు పోప్స్ , ది ఐరిష్ మ్యాన్ చిత్రాల నుంచి కూడా  సపోర్టింగ్ యాక్టర్‌కు నామినేషన్స్ వచ్చినా బ్రాడ్‌ పిట్‌నే ఈ అవార్డ్ వరించింది.

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ :

ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు లారా డర్న్. మ్యారేజ్ స్టోరీ మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ పోషించిన లారాడర్న్ ఆస్కార్ కమిటీ మనసు దోచుకున్నారు. భార్యాభర్తల బంధం వివిధ కారణాలతో చివరకు విడాకుల వరకు ఎలా వెళ్లింది అన్న స్టోరీ లైన్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో లాయర్ పాత్ర పోషించిన లారా డర్న్ తన కెరీర్‌లో తొలి ఆస్కార్ అందుకున్నారు.

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ :

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో టాయ్‌ స్టోరీ 4 చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ , ఐ లాస్ట్ మై బాడీ , క్లాస్‌, మిస్సింగ్ లింక్ చిత్రాలు బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడ్డాయి. అయితే ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా టాయ్‌ స్టోరీ 4 ఎంపికయ్యింది.జాష్ కూలీ, మార్క్ నీల్సన్, జోనస్ రివేరా టాయ్ స్టోరీ 4 చిత్రానికి అవార్డు అందుకున్నారు.

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ :

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది హెయిర్ లవ్ చిత్రం. మాథ్యూ చెర్రీ, కరెన్ టోలీవర్ హెయిర్ లవ్ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్ అందుకున్నారు. డిసెరా, కిట్‌బల్, మెమరబుల్ , సిస్టర్, చిత్రాలు కూడా నామినేషన్ దక్కించుకున్నా బెస్ట్ యానిమేషన్ షార్ట్ గా చివరకు హెయిర్ లవ్ ఆస్కార్ అందుకుంది.

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే :

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో అమెరికన్ కామెడీ డ్రామా మూవీ - జో జో రాబిట్‌ ఆస్కార్ అందుకుంది. కేజింగ్ స్కైస్ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రచన, దర్శకత్వం వహించిన టైకా వైటిటి ఆస్కార్ అందుకున్నారు. ఆయనకు ఇదే మొదటి ఆస్కార్ పురస్కారం కావడంతో టైకా వైటిటి ఉద్వేగానికి లోనయ్యారు.

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ :

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ గా ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకుంది అమెరికన్ చిత్రం ది  నైబర్స్ విండో. ఈ చిత్రాన్ని రచించి...దర్శకత్వం వహించిన మార్షల్ కర్రీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ పురస్కారాన్ని అందుకున్నారు.  ఇద్దరు పిల్లలు, భర్తతో ఓ మధ్యవయసు మహిళ ఎదుర్కొనే సమస్యలను ఇతి వృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ :

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో వన్స్‌ ఆపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డజైన్ అందించిన బార్‌బారా లింగ్  ఆస్కార్ అందుకున్నారు.  

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ :

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ పురస్కారం ద లిటిల్ వుమెన్‌కు దక్కింది. ఈ చిత్రాన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ అందించిన...జాక్యులైన్ డురాన్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అందుకున్నారు.

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ :

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌ గెలుచుకుంది అమెరికన్ ఫ్యాక్టరీ . ఈ చిత్రానికి స్టీవెన్ బాగ్నర్ , జూలియా రిచర్ట్ దర్శకత్వం వహించారు.  అమెరికాలో ఏర్పాటు చేసిన ఓ చైనా కంపెనీ కథాంశంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామాతో కలిసి ఏర్పాటు చేసిన హైయ్యర్ గ్రౌండ్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది.

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్:

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది లెర్నింగ్‌ స్కేట్‌ బోర్డ్‌ ఇన్‌ వార్‌ జోన్‌ చిత్రం. ఎప్పుడూ యుద్ధవాతావరణం కనిపించే కాబూల్ లాంటి ప్రాంతాల్లో చిన్నారుల బాల్యాన్ని ఇతి వృత్తంగా తీసుకుని ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు.

ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ :

ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ చిత్రం ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకుంది. డొనాల్డ్ సిల్వస్టర్ ఈ చిత్రానికి సౌండ్ ఎడిటింగ్ చీఫ్‌గా వర్క్ చేశారు. అద్భుతమైన సౌండ్ ఎడిటింగ్‌ అందించిన డొనాల్డ్ సిల్వస్టర్ తొలిసారిగా ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు.  జోకర్, 1917, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ , స్టార్ వార్స్ ది రైజ్ ఆఫ్ స్కైవాకర్స్.. చిత్రాలు కూడా ఈ విభాగంలో ఆస్కార్ కోసం పోటిపడ్డాయి.  

బెస్ట్ సౌండ్ మిక్సింగ్  :

బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంగా ఆస్కార్ అవార్డు అందుకుంది 1917. ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ అందించిన మార్క్ టేలర్....స్టువార్డ్ విల్సన్... ఆస్కార్ అందుకున్నారు.  ఆడ్ ఆస్ట్రా ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ...జోకర్...వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాలు కూడా బెస్ట్ సౌండ్ విక్సింగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి.

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ :

బెస్ట్‌ సినిమాటోగ్రాఫీ విభాగంలో ఆస్కార్ పురస్కారం అందుకుంది  బ్రిటిష్ చిత్రం 1917.  సినిమాటోగ్రఫి అందించిన రోజర్‌ డికన్స్‌ ఆస్కార్ అందుకున్నారు.  

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ :

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో....ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ ఆస్కార్ పురస్కారం అందుకుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ అందించిన మైఖేల్‌ మగాస్కార్‌, ఆండ్రూ బక్‌ ల్యాండ్‌లను ఆస్కార్ వరించింది. ఆండ్రూ ఒక్‌ల్యాండ్‌కు ఇదే తొలి ఆస్కార్ అవార్డ్. మైఖేల్ మగాస్కర్ కు కెరీర్‌లో ఇది రెండో ఆస్కార్ అవార్డ్.  

More Related Stories