English   

పిల్లలే టార్గెట్ గా మంచు విష్ణు

 manchu vishnu
2020-02-11 16:04:38

చాలామంది టాలీవుడ్ స్టార్స్ ఓ పక్క సినిమాలు చేస్తునే.. మరో పక్క సైడ్ బిజినెస్ చేస్తున్నారు. అలాగే సినిమాల విషయంలో ఆచి తూచి అడుగుపెట్టే మంచు విష్ణు కూడా బిజినెస్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మంచు ఫ్యామిలీ పిల్లల కోసం విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఇక ఇప్పుడు చిన్న పిల్లలకు సంబంధించిన ఫ్యాషన్ స్టోర్‌ను ప్రారంభించబోతున్నారు.

మంచు విష్ణు భార్య విరానికా తన పిల్లు అరియానా, వివియానా ల పేర్ల మీద సొంతంగా కిడ్స్ ఫ్యాషన్ స్టోర్ ని మొదలుపెట్టబోతున్నారు. ఈ స్టోర్స్ లో పిల్లలకి సంబంధించిన అన్ని రకాల ఫ్యాషన్ డ్రెస్ లు సాధారణ ప్రజలకి లో ఫ్రైజ్ లలో అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది.  ఈ స్టోర్స్ కి 'ది మంచు ట్విన్స్' అనే పేరు పెట్టనున్నారట. మే చివరి వారంలో ఈ బ్రాండ్‌ పేరును అనౌన్స్ చేయటంతో పాటు దేశవ్యాప్తంగా ఈ స్టోర్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

ఇకపోతే.. మంచు విష్ణు ప్రస్తుతం 'మోస‌గాళ్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్ కీల‌క పాత్రలో నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సమ్మర్ లో మోసగాళ్లు విడుద‌లకు సన్నాహాలు చేస్తున్నారు.

More Related Stories