English   

సెంటిమెంట్ వర్కౌట్ అయితే వరల్డ్ ఫేమస్ లవర్ బ్లాక్ బస్టరే..

World Famous Lover
2020-02-11 17:36:43

సినిమా ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్లనే. అందులోనూ కలిసొచ్చే సెంటిమెంటు ఉంది అంటే పదేపదే చెప్పుకుంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్స్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

 క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో నలుగురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటించారు. రాశి ఖన్నా, ఎజిబిల్లా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ తెరెసా ఇందులో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో హాట్ హాట్ సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఒక సెంటిమెంట్ మాత్రం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు బాగా కలిసి కలిసొస్తుంది. 

నిజం చెప్పాలంటే ఈ సినిమాపై అంచనాలు విజయ్ దేవరకొండ ముందు సినిమాపై ఉన్నంతగా లేవు. అప్పట్లో డియర్ కామ్రేడ్ సినిమా ఓ రేంజ్ లో అంచనాలతో విడుదలై ఫ్లాప్ అయ్యింది. ఇదిలా ఉంటే ఒక హిట్ ఇచ్చిన తర్వాత ఒక ఫ్లాప్ ఇవ్వటం విజయ్ దేవరకొండకు అలవాటుగా మారిపోయింది. పెళ్లిచూపులు సినిమాకు ముందు ఈయనకు సోలో హీరోగా ఇమేజ్ లేదు. ఆ సినిమాతో సంచలన విజయం అందుకొన్నాడు విజయ్ దేవరకొండ. ఆ వెంటనే ద్వారక సినిమా డిజాస్టర్. మళ్ళీ వెంటనే అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం అందుకొన్నాడు. ఈ సినిమాతో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. కానీ అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన ఏ మంత్రం వేసావే సినిమా కనీసం వచ్చినట్లు కూడా తెలియదు. మళ్లీ గీత గోవిందం సినిమా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 

ఈ సినిమా హిట్ అయిన తర్వాత భారీ అంచనాలతో వచ్చిన నోట సినిమా డిజాస్టర్ అయ్యింది.. అయ్యో అనుకునేలోపే టాక్సీ వాలా సినిమా సూపర్ హిట్ కొట్టాడు. ఇక గతేడాది డియర్ కామ్రేడ్ సినిమా ఎంత దారుణంగా ఫ్లాప్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో ఇప్పుడు సెంటిమెంట్ ప్రకారం చూస్తే వరల్డ్ ఫేమస్ లవర్ సూపర్ హిట్ కావాలి. ఒకవేళ ఇదేగాని జరిగితే పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమాకు ఇప్పటి నుంచే కష్టాలు తప్పవు. మరి చూడాలి ఏం జరుగుతుందో. 

More Related Stories