పవన్ సినిమాకి ఆసక్తికర టైటిల్

ఇంకా అసలు సినిమానే చేయడనుకున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఏడాది తన అభిమానులకే కాక సినీప్రియులకు కూడా డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్’ రీమేక్ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా కన్ఫాం చేశాడు. ఈ సినిమాతో పాటే క్రిష్‌తో చేస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ ఫిలింని కూడా షూట్ గట్టిగానే సాగుతోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ‘పింక్’ రీమేక్ కోసం ‘వకీల్ సాబ్’ అనే పేరు ఖరారు అయినట్టే. ఇక తాజాగా పవన్ - క్రిష్‌ల చిత్ర టైటిల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర పేరు బయటకొచ్చింది. ఖుషీ లాంటి సినిమాని నిర్మించిన ఏఎం రత్నం నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో పవ దొంగగా నటిస్తున్నాడు. తెలంగాణాలో పేరుమోసిన దొంగ తెలంగాణా రాబిన్ హుడ్ గా పేరున్న పండుగల సాయన్నగా దర్శనమివ్వబోతున్నారట. ఈ సినిమాకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్లో పవన్‌పై కీలక సీన్స్ షూటింగ్ జరుగుతోంది.