English   

రెండు సినిమాలు లైన్ లో పెట్టిన తేజ

raviteja
2020-02-11 20:20:40

కెరీర్ మొదటి నుండి డిఫరెంట్ స్టోరీలతో హిట్స్ కొట్టాడు డైరక్టర్ తేజ. డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా ‘చిత్రం’ నుండి మొన్నటి సీత దాకా చాలా సినిమాలు చేసి హిట్స్ కొట్టాడు. ఇక ఆయన చేసిన ‘నువ్వు నేను’ సినిమాకే ఆరు నంది అవార్డులు వచ్చాయంటేనే అర్ధం చేసు కోవచ్చు. అయితే చాలా కాలం తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘సీత’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి అది వేరే విషయం. ఇక ఆయన ఇప్పుడు మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టినట్టు చెబుతున్నారు. రానాతోనే మరో సినిమాను చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి ‘రాక్షస రాజు రావణుడు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్టు చెబుతున్నారు. మరో వైపున గోపీచంద్ హీరోగా మరో సినిమా చేయడానికి కూడా ఆయన రెడీ అవుతున్నారు. ఆ సినిమాకి ‘అలివేలు వెంకటరమణ’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట. ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడని అంటున్నారు.

 

More Related Stories