English   

దిల్ రాజు రెండో పెళ్లి తేదీ ఫిక్స్.. మరికొద్ది గంటల్లోనే..

dilraju
2020-02-12 07:51:00

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు. చాలా చిన్న వయసులోనే నిర్మాతగా మారిన ఈయన ఇప్పటికే 25 సినిమాలు మైలురాయిని కూడా అందుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి అందులో సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. నిర్మాతగా తన కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఈయన ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కుటుంబ సభ్యులు. కానీ ఇప్పుడు రెండో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఫిబ్రవరి 15న దుబాయిలో ఈయన రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇండస్ట్రీలో ఎవరిని ఈ పెళ్లికి ఆహ్వానించలేదు దిల్ రాజు. తన సన్నిహితులతో పాటు కొందరు బంధువులను మాత్రమే తన రెండో పెళ్ళికి రాజు ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కేవలం ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితులకు మాత్రమే రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు దిల్ రాజు. ఈయన రెండో పెళ్లి వార్త చాలామందికి షాకింగ్ గా ఉండొచ్చు కానీ కొన్ని రోజులుగా ఈ వార్త మాత్రం వినిపిస్తూనే ఉంది.

మూడేళ్ల కింద దిల్ రాజు భార్య అనిత అనారోగ్యంతో చనిపోయింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉన్న దిల్ రాజు  ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుంటున్నాడని తెలుస్తోంది.  దిల్ రాజు చేసుకోబోయే అమ్మాయి బ్రాహ్మణ్. చాలా రోజులుగా ఈ అమ్మాయితో దిల్ రాజుకు పరిచయం ఉంది. రాజు చేసుకోబోయే అమ్మాయి తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారని.. ఈ మధ్యే ఇండియాకు వచ్చినప్పుడు తన రెండో పెళ్లి గురించి వాళ్లతో మాట్లాడాడని ప్రచారం జరుగుతుంది. ఇక అమ్మాయి కూడా గతంలో  కొన్ని రోజులు ఎయిర్ హోస్టెస్ గా పని చేసిందని తెలుస్తోంది. ఏదేమైనా కూడా మరికొద్ది గంటల్లోనే రాజుగారు మరోసారి ఇంటివాడు కాబోతున్నాడు.

More Related Stories