English   

విజయ్ దేవరకొండ.. ది పర్ఫెక్ట్ బిజినెస్ మాన్..

vijay
2020-02-12 08:20:41

బిజినెస్ మాన్ అని పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో తీశాడు కానీ ఈ టైటిల్ కు పక్కా సరిపోయే హీరో మాత్రం విజయ్ దేవరకొండనే. ఇండస్ట్రీకి వచ్చిన నాలుగు సంవత్సరాలలో చాలా నేర్చుకున్నాడు ఈ కుర్ర హీరో. ముఖ్యంగా ఫ్లాపులు వచ్చినప్పుడు కూడా ఇమేజ్ ఎలా పెంచుకోవాలి అనేది ఈ హీరోని చూసి నేర్చుకోవాలి. ఒకటి రెండు ఫ్లాపులు వస్తే కెరీర్ ఎలా నిలబెట్టుకోవాలో తెలియక చాలా మంది హీరోలు తికమక పడుతుంటారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం అలా కాదు. ఆయన కెరీర్ కు ఆయనే పూలబాట వేసుకుంటున్నాడు. ముఖ్యంగా తనకు ఉన్న ఇమేజ్ ఎక్కడా పడిపోకుండా జాగ్రత్త పడుతున్నాడు ఈ హీరో. సినిమాలతో సంబంధం లేకుండా తన ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నాడు. దానికోసం బిజినెస్ మార్గాన్ని ఎంచుకున్నాడు విజయ్ దేవరకొండ.

గీత గోవిందం సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత రౌడీ వేర్ అంటూ క్లోతింగ్ బిజినెస్ మొదలు పెట్టాడు విజయ్. ఇది కాస్త సూపర్ పాపులర్ అయ్యింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ కూడా విజయ్ దేవరకొండే. ఎక్కడ చూసినా కూడా రౌడీ బ్రాండ్ దుమ్ము లేపింది. ఇక ఇప్పుడు తన క్లోతింగ్ బిజినెస్ నేషనల్ వైడ్ గా పెంచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. దీనికోసం మింత్రతో టై అప్ అయ్యాడు ఈ హీరో. దీనివల్ల తన క్లోతింగ్ బిజినెస్ దేశవ్యాప్తంగా సంచలనం కానుంది. అందుకే మరో అడుగు ముందుకు వేశాడు విజయ్ దేవరకొండ. సినిమాలు లేకపోయినా బిజినెస్ లో మాత్రం తన ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ కుర్రహీరో. దీనికోసం ఇమేజ్ ఉన్నప్పుడే అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. దీనిపై అంచనాలు పెద్దగా లేవు.. కానీ విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ పెరిగిపోతుంది. ఏదేమైనా అటు సినిమాలు ఇటు బిజినెస్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నాడు విజయ్.

More Related Stories