English   

మరో రేర్ ఫీట్ కి రెడీ అవుతున్న సరిలేరు నీకెవ్వరు

Saileru Neekevvaru
2020-02-12 10:47:43

50 రోజులు..100 రోజులు సినిమాలు ఆడే రోజులు పోయాయి. ఇప్పుడ‌న్ని బాక్సాఫీస్ లెక్క‌లు మాత్ర‌మే.సివారం రోజుల్లో ఏ సినిమా ఎంత వ‌సూళ్లు చేసింది? మొద‌టి రోజు వ‌సూళ్లు ఎంత‌? వారాంతానికి ఎంత సాధించింది? ఇక ఫుల్ రన్ లో ఎంత సాధించింది అనేదే లెక్క‌. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజయ్యింది. ఈ సినిమాలో ఆర్మీ మేజర్ పాత్రలో నటించిన మహేష్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పచ్చు. 

సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్ల‌ను సాధించింది. దీంతో 100 కోట్లు 150 కోట్లు బ్లాక్ బాస్ట‌ర్ కా బాప్, సంక్రాంతి మొగుడు అంటూ పోస్ట‌ర్లు వేసి మరీ హ‌డావుడి చేశారు.  ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకోవడానికి యూనిట్ మొత్తం సక్సెస్ మీట్ వరంగల్ జిల్లా హన్మకొండ లో ఎంతో వైభవంగా నిర్వహించార. 

ఆ ఈవెంట్ తర్వాత మహేష్ బాబు, తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లారు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి మరి కొద్ది రోజుల్లో మహేష్ బాబు ఇండియాకు వస్తారని, ఆయన రాగానే ఈ సినిమా 50 డేస్ ఫంక్షన్ ని గ్రాండ్ లెవెల్లో చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ వేడుకను ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. కర్నూల్ లేదా విజయవాడలలో ఈ ఈవెంట్ చేసే అవకాశం ఉందని అంటున్న్నారు.

More Related Stories