మరో క్రేజీ ఆఫర్ సంపాదించిన రష్మిక

ఛలో సినిమాతో అనుకోకుండా తెలుగు వాళ్ళకి పరిచయమైన రష్మికా ఆ సినిమా తర్వాత చేసిన `గీత గోవిందం`తో స్టార్ స్టేటస్ సంపాదించింది. ఇటీవలే `సరిలేరు నీకెవ్వరు` రూపంలో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక త్వరలో భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ చేయనున్న సినిమాలో కూడా ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్నది.
తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఆమెను హీరోయిన్ గా ఎంపికయిందని సమాచారం. నాగచైతన్య హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఆ టైటిల్ రోల్నే నాగచైతన్య చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలోనే రష్మికా మందన్నా నటించబోతున్నారనే వార్త షికారు చేస్తోంది.
పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతగోవిందం’ చిత్రంలో గీతగా రష్మిక నటించగా ఆ పరిచయంతోనే ఆ దర్శకుడు ఆమెను సంప్రదించినట్టు చెబుతున్నారు. మార్చి నుండి సేత్స్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.