English   

ప్రభాస్ ఫ్యాన్స్ కి శుభవార్త 

Prabhas
2020-02-12 11:16:24

డార్లింగ్ ప్రభాస్ 'సాహో' తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మొదట్లో 'జాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు రాధే శ్యాం 'ఓ డియర్' టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. 

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాది సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్  ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది ఉగాది మార్చి 25వ తేదీ వచ్చింది. ఈ ఏడాది ఆ రోజునే రిలీజ్ చేస్తారని అంటున్నారు. బాహుబలి, సాహో వంటి డిఫరెంట్ జానర్ సినిమా తర్వాత ప్రభాస్‌ చాలాకాలం తర్వాత పూర్తిస్థాయిలో నటిస్తున్న లవ్ స్టోరీ కావడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. 

గతంలో చిత్ర బృందం ప్రభాస్‌ ది ఒక ఫొటోను విడుదల చేసినా అందులో ముఖం కనిపించకపోవడంతో నిరాశకు గురయ్యారు అభిమానులు. ఇప్పుడు వాళ్ల కోసం ఫస్ట్‌లుక్‌ సరికొత్తగా తీర్చిదిద్దుతుందట చిత్ర బృందం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.  

More Related Stories