English   

బాలకృష్ణ బోయపాటి సినిమాలో ఫ్లాప్ హీరోయిన్..

Balakrishna
2020-02-12 11:43:41

బయటకి చెప్పుకోవడం లేదు కానీ సీనియర్ హీరోలకు మాత్రం హీరోయిన్ల సమస్య బాగా కనిపిస్తోంది. ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు వస్తున్నా కూడా సీనియర్ హీరోలకు మాత్రం సరైన జోడి దొరకడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త సినిమా మొదలైనప్పుడు హీరోయిన్ల కొరత బాగా వేధిస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు అయితే స్టార్ హీరోయిన్లతో నటించడం లేదు. అస్సలు క్రేజ్ లేని ముద్దుగుమ్మలకు బాలకృష్ణ ప్రతిసారీ బ్రేక్ ఇస్తుంటాడు. 

మొన్నటికి మొన్న రూలర్ సినిమాలో కూడా ఎప్పుడో కనిపించడం మానేసిన సోనాల్ చౌహాన్, వేదిక లాంటి హీరోయిన్లతో జోడీ కట్టారు బాలయ్య. ఇక ఇప్పుడు బోయపాటి సినిమాలో కూడా ఇదే కష్టాలు వెంటాడుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా ముందు రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. చివరికి అందరూ పోయి అంజలి పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆమెను కూడా పక్కనపెట్టి మరో ఫ్లాప్ హీరోయిన్ ను బాలకృష్ణ కోసం తీసుకొస్తున్నాడు బోయపాటి శ్రీను. ఆమె మరెవరో కాదు.. కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్. 

గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈమె. ఆ తర్వాత ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేసినా కూడా ప్రగ్యాకు ఒక్క విజయం కూడా రాలేదు. ఎంతగా అందాలు ఆరబోసిన కూడా ఈమె అందమంతా అడవి కాచిన వెన్నెలగా మారిపోయింది. ఇలాంటి సమయంలో బాలకృష్ణ సినిమాలో బోయపాటి ఆఫర్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. కంచె సినిమా తర్వాత సరైన బ్రేక్ కోసం వేచి చూస్తున్న ప్రగ్య జైస్వాల్ బాలయ్య సినిమాతో ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 2020 దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. 

More Related Stories