English   

రాజమౌళి కోసం శంకర్ వెనక్కి తగ్గుతాడా...

Indian 2
2020-02-12 15:45:29

ముందు నుంచి అనుకున్నట్టుగానే జక్కన్న తెరెకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదా పడింది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ క్రేజీ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆర్ఆర్ఆర్.. సంక్రాంతి రేసులో దిగడంతో ఆ సమయంలో రిలీజ్ కు ప్లాన్ చేసుకున్న కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. కానీ.. మరో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ మాత్రం బరిలోనే ఉంటున్నాడని వినిపించింది.

యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కిస్తున్న భారతీయుడు సీక్వెల్ గా వస్తున్న ఇండియన్-2 సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని వినిపించింది. దాంతో ఈ రెండు ప్యాన్ ఇండియా సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొందనుకున్నారు. కానీ తాజాగా కోలీవుడ్ వార్తల ప్రకారం.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తో పోటీ వద్దని భావిస్తున్నాడట శంకర్. ఎందుకంటే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఇండియన్-2 కలెక్షన్లపై ఎఫెక్ట్ పడకుండా.. సింగిల్ గా సమ్మర్ లో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. 

అయితే ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయినా భారీ సినిమాలు పోటీకి సై అంటే.. ఖచ్చితంగా కలెక్షన్ల పై ప్రభావం ఉంటుందని.. రెండు సినిమాలు కొంత గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ రిలీజ్ అయినా వారం గ్యాప్ ఉంటుంది కాబట్టి.. ఎవరి కలెక్షన్లు వారికుంటాయని కూడా అంటున్నారు. మరి శంకర్ నిజంగానే తగ్గుతాడా లేదా అనేది వేచి చూడాలి.

More Related Stories