తెలుగులో శక్తిగా తమిళ్ హీరో

తమిళ నటుడు విశాల్, గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ఇరుంబు థిరై. తెలుగులో ఈ సినిమా అభిమన్యుడు గా రిలీజ్ అయి రెండు చోట్లా మంచి హిట్ గా నిలిచింది. పీయస్ మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హరి గుజ్జలపూడి నిర్మించిన ఈ సినిమా విశాల్ కే కాక దర్శకుడు మిత్రన్ కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ దర్శకుడు దర్శకత్వం వహించిన తాజా తమిళ మూవీ "హీరో" తెలుగులో శక్తి పేరుతో విడుదల కానుంది.
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించారు. కేజేఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని కోటపాడి రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. శక్తిమాన్ సీరియల్ ప్రభావంతో సూపర్‌మేన్ అవుదామనుకున్న ఓ కుర్రాడు చేసిన పనులు ఏంటి? తండ్రి సలహాతో లైఫ్‌లో ఎలా సెటిలయ్యాడు? అతను చేసిన సూపర్‌మేన్ పనులేంటి? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందించినట్టు చెబుతున్నారు.