English   

విడ్డూరం : పారాసైట్ విజయ్ సినిమాకి కాపీ అట

vijay
2020-02-13 07:33:33

ఆస్కార్‌ అవార్డ్స్ లో హైలైట్ గా నిలిచిన పారాసైట్‌ ఓ కాపీ మూవీనా..? తమిళ స్టార్‌ హీరో విజయ్‌ మూవీకి.. పారాసైట్‌కి పోలికలున్నాయా..? అంటే అవుననే అంటున్నారు విజయ్‌ ఫ్యాన్స్‌.  పారాసైట్‌ మూవీకి, విజయ్‌ సినిమా మిన్సార కన్నాకి లింకులు పెడుతూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు విజయ్‌ ఫ్యాన్స్‌. పారసైట్‌.. ! ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఈ కొరియన్‌ సినిమా గురించే చర్చ జరుగుతోంది.  ఎందుకంటే.. ఓ కొరియన్‌ చిత్రం ఆస్కార్‌ అవార్డు గెలవడం ఇదే తొలిసారి. ఆస్కార్ అవార్డుల్లో ఓ దక్షిణ కొరియా సినిమా ఉత్తమ విదేశీకేటగిరీలోకి ఎంట్రీ అయిన దాఖలాలే లేవు. అలాంటిది పారాసైట్ ఏకంగా ఓవరాల్ కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్ర్కీన్‌ప్లైతో పాటు బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ పిల్మ్‌విభాగాల్లో కూడా అస్కార్‌ అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా దానికి ఈ అవార్డులు రావడంలో అతిశయోక్తి లేదంటారు. అయితే ఈ మూవీ కోలీవుడ్‌ హీరో విజయ్‌కి చిత్రానికి కాపీ అంటున్నారు అతడి ఫ్యాన్స్‌. విజయ్ ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించిన 'మిన్సార కన్నా' సినిమాతో 'పారసైట్'కు పోలికలు ఉన్నాయని ట్రోలింగ్‌ చేస్తున్నారు. బహుశా సౌత్ కొరియన్ డైరెక్టర్ ఈ సినిమా చూసి స్ఫూర్తి పొంది ఆ కథనే కొంచెం మార్చి, కొన్ని మలుపులు జోడించి 'పారసైట్ ' తీసి ఉండొచ్చని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఈ రెండు మూవీలు ఒక ధనవంతుల కుటుంబం, ఒక పేద కుటుంబం మధ్య నడిచే కథతో ముడిపడివున్నాయ్‌. దీంతో పారాసైట్‌ చిత్రం.. విజయ్‌ మూవీకి కాపీ అంటూ ట్రోల్‌ చేస్తున్నారని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

 

More Related Stories