English   

రామ్ తో బాబీ సినిమా..

ram
2020-02-13 08:12:34

వెంకీ మామ లాంటి సినిమా తీసి హిట్ కొట్టి జోరు మీదున్నాడు బాబీ. ఆ సినిమాలో అసలు లాజిక్కే లేదని ఒక వర్గం అంటున్నా ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి కలెక్షన్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు ఆయన తర్వాత సినిమా ఏమిటి అనే విషయం మీద ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది. నిజానికి ఆయన వెంకటేష్ నారప్ప సినిమాకి యాక్షన్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడని ఒక రకమైన ప్రచారం జరగగా ఆ విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం బాబీ హీరో రామ్ కి ఒక కధ నేరేట్ చేసినట్టు చెబుతున్నారు. ఆ కధ రామ్ కి కూడా నచ్చిందని త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళవచ్చని అంటున్నారు. మైత్రీ మేకర్స్ నిర్మాణంతో ఈ సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ హిట్ తో జోష్ మీదున్న రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడమ్ సినిమాకి ఈ సినిమా రీమేక్. ఇక ఈ సినిమా ఓకే అయిందని అంటున్నారు కానీ. మిగతా విషయాలు ఏవీ బయటకు రాలేదు.

More Related Stories